ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిసెంబరు 2కు వాయిదా వేసింది. విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన మరో మూడు పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. తాను సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై చట్టవిరుద్ధంగా కేసులు నమోదు చేసారని .. ఇప్పటివరకు నమోదైన కేసులను రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో ఆర్జీవీ కోరారు. కాగా, రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చిలో ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ పై కేసులు నమోదు చేశారు.