Homeహైదరాబాద్latest Newsగొల్లపల్లి మండలంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన అడ్లూరి

గొల్లపల్లి మండలంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన అడ్లూరి

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రుద్రవేణి తిరుపతి,ఉత్తేం భారత,దుమల్ల గంగయ్య పలు అనారోగ్య కారణాల వలన ఇటీవల మృతి చెందగా సోమవారం రోజున వారి కుటుంబాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన బోలిశెట్టి ప్రభాకర్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,మాజీ సర్పంచ్ చిర్ర గంగాధర్, నాయకులు కాసారపు అరవింద్ గౌడ్,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img