తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు పార్థసారధి, ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ, దేవాదాయశాఖ అధికారులు హాజరు అయ్యారు. సాయంత్రంలోగా పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. శ్రీవారి ప్రతిష్ట, భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.