సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి – ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు వైద్య ఉపకరణాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
- రూ.2.15 కోట్ల రూపాయల వ్యయంతో సిటీ స్కాన్ కేంద్రం
- రూ.2.40 కోట్ల రూపాయల వ్యయంతో 20 పడకల ఐసీయూ కేంద్రం
- రూ.40 లక్షల రూపాయల వ్యయంతో లిఫ్ట్
కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేని పేదలకు ఉపయోగపడే సౌకర్యాల కల్పన పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సిద్దిపేట ప్రాంత ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలోని అధునాతన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాం, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ్ అరసు, సూపరింటెండెంట్ జయశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.