ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆ దేశంలో ఆ ఉగ్రవాదులు బాలికలు చదువుకోకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే మహిళలు, బాలికలపై పలు ఆంక్షలు విధించారు.
ఆ దేశంలో ఉండే ఏకైక బాలికల పాఠశాల స్కూల్ ఆఫ్ లీడర్‌షిప్ ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు చొరబడి విద్యార్థినుల చిరునామా వంటి వివరాలు తీసుకోకుండా ఆ బడి నిర్వాహకులు అమ్మాయిల వివరాలు ఉండే పత్రాలను తగులబెట్టారు.
ఆ పాఠశాల వ్యవస్థాపకుడు షబనా బాసిజ్ రాషిఖ్ ఆధ్వర్యంలో సిబ్బంది విద్యార్థినులకు సంబంధించిన పత్రాలను తగులబెట్టారు.
ఈ విషయాన్ని షబనా బాసిజ్ రాషిఖ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
తాలిబన్ల నుంచి విద్యార్థినుల కుటుంబాలను కాపాడేందుకే ఈ పని చేశామని చెప్పారు.