Homeహైదరాబాద్latest Newsపండుగ ముగించుకొని పట్నం బాట పట్టిన పల్లె వాసులు.. ఆ హైవేపై ఫుల్ ట్రాఫిక్ జామ్..!

పండుగ ముగించుకొని పట్నం బాట పట్టిన పల్లె వాసులు.. ఆ హైవేపై ఫుల్ ట్రాఫిక్ జామ్..!

దసరా పండుగ ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి పట్నం బాట పట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్-కరీంనగర్ హైవేపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. తిమ్మాపూర్ మండలం రేణిగుంటలోని టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది యత్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img