బాల్య వివాహాన్ని ఎదిరించిన ఓ యువతి ఇంటర్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది. కర్నూలు జిల్లా ఆదోని మండలానికి చెందిన నిర్మల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి చిన్నతనంలోనే పెళ్లి చేయాలని భావించారు. ఆ పెళ్లిని ఆపించిన అధికారులు కేజీబీవీలో చేర్పించారు. అక్కడ పట్టుదలతో చదివి తాజాగా ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 421 మార్కులు సాధించింది.