ప్రజాభవన్ వద్ద మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేపట్టారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తమ భూములను మాజీ మంత్రి కబ్జా చేశారని ఆరోపించారు. తమకు 360 ప్లాట్లు ఉంటే అందులో.. 110ప్లాట్‌లను కబ్జా చేశారని అంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి పేదలకు నిలువు నీడ లేకుండా చేశారని బాధితులు మండిపడ్డారు. పేద ప్రజల పట్ల యముడిలా మారారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
కబ్జా చేసిన భూములను తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వందమందికి పైగా మల్లారెడ్డి బాధితులు ఉన్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. మల్లారెడ్డి రౌడీలతో భయపెట్టారని బాధితులు ఆరోపించారు. భూములు కబ్జా చేసి ధరణిలో నమోదు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.