Homeఅంతర్జాతీయంIndia USA Navi : భారత-అమెరికా నేవీల మధ్య కీలక ఒప్పందం

India USA Navi : భారత-అమెరికా నేవీల మధ్య కీలక ఒప్పందం

India USA Navi : భారత-అమెరికా నేవీల మధ్య కీలక ఒప్పందం

India USA Navi : భారత్-అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడనున్నాయి.

దేశ రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

అక్కడ అమెరికా సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌తోపాటు, రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్‌తో పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ పరంగా కీలక ఒప్పందాలు జరిగాయి.

దీని ప్రకారం అమెరికన్ యుద్ధ నౌకల నిర్వహణతోపాటు మరమ్మతులు చేసేందుకు భారత షిప్‌యార్డ్‌లను వినియోగించుకోనున్నారు.

మన షిప్‌యార్డ్‌లు ఈ విషయంలో ఎంతవరకు ఉపయోగపడగలవో ముందుగా అక్కడి నిపుణులు పరిశీలిస్తారు.

ఈ నిర్ణయం వల్ల భారత్-అమెరికా రక్షణ సంబంధాలు మెరుగుపడటమే కాకుండా, మన షిప్‌యార్డ్‌లకు అదనపు వ్యాపారం జరిగే అవకాశం ఉంది.

పదేళ్లుగా భారత్, అమెరికాతో రక్షణ సంబంధాల్ని మరింతగా పెంచుకుంటోంది.

ముఖ్యంగా ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఇరు దేశాల నేవీకి సంబంధించి సహకారం మెరుగవుతోంది.

Medical shop : బ్రాండ్ వేరు కానీ మందు అదే అని మెడికల్ షాప్ వాళ్ళు మందులు ఇస్తే.. మ‌నం చూడాల్సింది ఏమిటి?

Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?

Recent

- Advertisment -spot_img