Homeహైదరాబాద్latest Newsఓ వైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు..!

ఓ వైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఏఐసీసీ ఆదేశాలతో అదానీ వ్యవహారంలో జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు ఇవాళ సీఎం రేవంత్, మంత్రులు నిరసన చేపట్టారు. అయితే సీఎం రేవంత్ బృందం దావోస్ పర్యటనలో భాగంగా అదానీ సంస్థతో రూ.12,400 కోట్లతో MOU కుదుర్చుకుంది. కాగా తాము అధిష్టానం ఆదేశాలు పాటిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఓ వైపు ఒప్పందాలు చేస్తూనే.. మరోవైపు నిరసనలు కూడా తెలుపుతూ భిన్న వైఖరి తో ముందుకెళ్తుంది.

Recent

- Advertisment -spot_img