– జడ్పీ సమావేశంలో ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న డిమాండ్
ఇదే నిజం, నర్సంపేట : నర్సంపేట నియోజవర్గానికి జీవో నెంబరు 346 ద్వారా మంజూరైన రూ. 37 కోట్ల వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని జడ్పీ ఫోర్ల్ లీడర్ పెద్ది స్వప్న డిమాండ్ చేశారు. శుక్రవారం హన్మకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల గుండెపోటుతో మరణించిన జనగాం జిల్లా జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి పట్ల సభ్యులందరూ మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న మాట్లాడుతూ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ , జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.