ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలంలో రేషన్ కార్డు లేకుండా రుణ మాఫీ కానీ రైతుల వివరాల సేకరణను గురువారం వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రారంభించారు.పంట రుణమాఫీ 2024 లబ్ధి కోసం రేషన్ కార్డు లేని రైతు నుంచి కుటుంబ దృవీకరణ పత్రాన్ని తీసుకుంటున్నారు. దృవీకరణ పత్రంలో బ్యాంకు,ఆధార్ కార్డు వివరాల తో పాటు కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరుస్తున్నారు.కుటుంబ సభ్యుల నిర్దారణ కోసం ఇస్తున్న వివరాలు వాస్తవమే అంటూ లబ్ధిదారుడి నుంచి అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నారు.వ్యవసాయ విస్తరణ అధికారి రుణ మాఫీ కానీ లబ్ధిదారుడి వివరాలు సేకరించడమే కాకుండా వారితో సెల్ఫీ దిగి యాప్ లో పొందు పరచాల్సి ఉంటుంది.ప్రస్తుతం రేషన్ కార్డు లేకుండా రూ.2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతుల వివరాలు యాప్ లో వస్తున్నాయ్.ఈ కార్య్రమంలో ఏ ఈ ఓ లు సమత,అజయ్ కుమార్,నవ్య,ధరణి లు పాల్గొన్నారు.