ఇదేనిజం, కరీంనగర్ టౌన్ : కాంగ్రెస్ మైనార్టీ సెల్ నగర చైర్మన్గా మహ్మద్ అలీని నియమిస్తూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ లో ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి కార్యకర్తగా కొనసాగుతూ మైనార్టీల సమస్యలపై అవగాహన కలిగి ఉండటం, పలు సందర్భాల్లో వారి సమస్యల కోసం కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాల్లో క్రియాశీలక బాధ్యత వహించడం, పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా కొనసాగిన అహ్మద్ అలీకి ఈ బాధ్యత అప్పగించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ మోసిన్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ తాజుద్దీన్కు అలీ కృతజ్ఞతలు తెలిపారు.