HomeSocial Media‘60% JOBS పైన AI EFFECT’

‘60% JOBS పైన AI EFFECT’

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)’ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జియేవా అభిప్రాయపడ్డారు. ఏఐతో కొన్ని రకాల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లడానికి ముందు ఆదివారం మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 60 శాతం ఉద్యోగాలపై ఈ కృత్రిమ మేథ ప్రభావం ఉంటుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం 40 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేశారు. నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు అధికంగా ఉన్న రంగాలపై ఈ సాంకేతికత ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. కృత్రిమ మేథతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేలా పేద దేశాలకు మద్దతివ్వాల్సిన అవసరం ఉందని క్రిస్టిలినా చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img