టీపీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంతకం కూడా చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏ క్షణమైనా అధికారిక ప్రకటన రానున్నట్లు చెబుతున్నారు. కాగా బీసీ సామాజికవర్గం నుంచి ఈ పదవికి మధుయాష్కీ గౌడ్ పోటీపడినా మహేశ్ వైపే అగ్ర నేత సోనియా గాంధీ మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.