ఇదేనిజం,శేరిలింగంపల్లి: అఖిల భారత ప్రజా తంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం మియాపూర్, లోని స్టాలిన్ నగర్ లో జరుగనుందని గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి.మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎ ఐ ఎఫ్ డి వై రాష్ట్ర నిర్మాణ బాధ్యులు పెద్దారపు రమేష్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్ర రాజిరెడ్డి, వనం సుధాకర్ వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరై భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించనున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.