ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
- రంగంలోకి దిగిన ఫైర్ సెఫ్టీ అధికారులు
ఇదేనిజం, ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పాత ఓపీడీ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగాయి. ఈ గది కింది అంతస్తులో ఎమర్జెన్సీ వార్డు కూడా ఉండటంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఎయిమ్స్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎండోస్కోపి గదిలోని రోగులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని దిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.