ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో చిట్యాల చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలు మండల రజక సంఘం అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు పురస్కరించుకొని ఆమె విగ్రహానికి మండల ప్రజా ప్రతినిధులు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ భూమికోసం భుక్తి కోసం రజాకార్లను ఎదిరించి పోరాడి వీరనారి చాకలి ఐలమ్మ, ఆమె వర్ధంతిలు జయంతులు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అంతేకాకుండా హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండి పై ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఎంపిటిసి లు గజ్జల రాజు, శ్రీనివాస్, రజక సంఘం అఖిల భారతీయ జిల్లా అధ్యక్షులు అక్కరాజు, పరశురాములు, సుద్దాల దేవయ్య, తలారి నర్సింలు, కోల కృష్ణ, రజక సంఘం నాయకులు భాను శరయ్య, దిటి బాలయ్య, ఆకారం శ్రీనివాస్, మాచర్ల బాలయ్య, రాజు, నాయకులు సంచు మల్లయ్య. రంజాన్ రాజలింగం. రజక సంఘం కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.