ఎయిరిండియా బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించే క్రమంలో 10శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే ఉండనుంది. ఇది దేశీయ, అంతర్జాతీయ విమానాలు రెండింటికీ వర్తిస్తుంది.
ప్రయాణికులు విమానాల్లో ప్రయాణాల ద్వారా సంపాదించిన పాయింట్లను ఉపయోగించి కాంప్లమెంటరీ అప్‌గ్రేడ్, ఇతర ప్రయోజనాలను ఆస్వాదించేందుకు వీలు కల్పిస్తోంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.