ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తమ సంస్థలోని 25 మంది ఉద్యోగులపై వేటు వేసింది. సిక్‌లీవ్ అనంతరం తిరిగి విధుల్లో చేరకుండా..సంస్థ నిబంధనలు అతిక్రమించినందుకు టర్మినేట్ చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. విమాన సర్వీసుల్లో అంతరాయాలకు సీఈఓ క్షమాపణలు చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.