Homeహైదరాబాద్latest Newsతిరుచ్చిలో సురక్షితంగా ఎయిర్ ఇండియా ల్యాండైన విమానం

తిరుచ్చిలో సురక్షితంగా ఎయిర్ ఇండియా ల్యాండైన విమానం

ల్యాండింగ్ గేర్ సమస్యతో దాదాపు రెండు గంటలపాటు తమిళనాడులోని తిరుచ్చి నగరంపై చక్కర్లు కొడుతున్న షార్జాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. బోయింగ్ 737 విమానం, 141 మంది ప్రయాణీకులతో సాయంత్రం 5:45 గంటలకు తిరుచ్చి విమానాశ్రయం నుండి బయలుదేరింది. అయితే ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా రెండు గంటలు పాటు గాల్లోనే తిరిగింది. అనంతరం పైలట్లు విమానాన్ని సురక్షితంగా దించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో 141 మంది ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్లకు ప్రయాణికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విమానం చక్రాల హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ కావడంతో పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. తిరుచ్చి విమానాశ్రయంలో ముందుజాగ్రత్తగా అధికారులు అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.

Recent

- Advertisment -spot_img