ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ విషయంపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గ్రాప్-4 అమలు చేస్తున్నట్లు సీఎం అతిషి ప్రకటించారు. గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) – 4 కింద మరిన్ని నిబంధనలను ఈ రోజు నుండి అమలు చేయనున్నట్లు వెల్లడించింది.గంట గంటకు పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. టెన్త్, 12వ తరగతి తప్ప మిగిలిన తరగతుల విద్యార్థులందరికీ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలి తెలిపారు. రోడ్డులపై BS-IV లేదా పాత డీజిల్ రవాణా వాహనాలు, హెవీ గూడ్స్ వెహికల్స్ పై నిషేధం విధించారు. ఎన్ఆర్సి ప్రాంతంలోని అన్ని కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని, మిగిలిన వాటికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫార్సు చేయబడింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 490కి గాలి నాణ్యత పడిపోయింది.