ఇదేనిజం, నేషనల్ బ్యూరో: వివాహం అనేది వ్యక్తి జీవితంలో ఎంతో ముఖ్యం. అయితే తాజాగా ఓ తండ్రి తన కూతురు కోసం ఎంతో రిచ్ గా వివాహం జరిపించారు. విమానంలో వివాహం జరగడం.. రన్ వే మీద బరాత్ నిర్వహించడంతో ఈ పెళ్లి వార్తల్లోకి ఎక్కింది. భారత్‌కు చెందిన దిలీప్ పోప్లీ యూఏఈలో వ్యాపారిగా స్థిరపడ్డారు. ఆయన కూతురు విధి పోప్లీ వివాహం అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు. అందుకు ప్రైవేట్ జెటెక్స్ బోయింగ్ 747లో ఏర్పాట్లు చేశారు. వరుడు హృదేశ్ సైనాని పెళ్లి దుస్తులు ధరించి బ్యాండ్ బారాత్‌తో డాన్స్ చేస్తూ విమాన రన్‌వే వరకు వచ్చారు. ఈ వేడుకకు 300 మంది అతిథులు హాజరయ్యారు. వధూవరులు, అతిథులతో విమానం దుబాయ్ ప్రైవేట్ టెర్మినల్ నుంచి ఒమన్‌కు బయలుదేరింది. విమానం గగనతలంలో ఉండగానే ఈ జంట వివాహంతో ఒక్కటైంది. ఇందుకోసం భారీగా ఖర్చైనట్టు సమాచారం.