Homeజిల్లా వార్తలుఏఐఎస్ఎఫ్ నారాయణఖేడ్ మండల నూతన కమిటీ ఎన్నిక..!

ఏఐఎస్ఎఫ్ నారాయణఖేడ్ మండల నూతన కమిటీ ఎన్నిక..!

ఇదేనిజం, నారాయణఖేడ్: అఖిలభాత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నారాయణఖేడ్ మండల నూతన కమిటీ గురువారం ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ దత్తు రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా నిఖిల్ మండల అధ్యక్షుడిగా రోహిత్ పలువురిని ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ….భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించబడిన విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు.

భారత దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం మరియు విద్యారంగ సమస్యల పైన సంక్షేమ వసతి గృహాల పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యావ్యతిరేఖ విధానాలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సిహెచ్ అశోక్ పాల్గొన్నారు.అనంతరం మండల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో మమ్మల్ని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో నారాయణఖేడ్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్,అరుణ్ , చైతన్య,శ్రీకాంత్ పలువురిని ఉపాధ్యాయులు సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img