Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ 2007 ఏప్రిల్ 20న వివాహం చేసుకున్నారు. వారికి ఆరాధ్య అనే కూతురు ఉంది. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ ఇంట్లో విభేదాలు మరియు ఇబ్బందుల గురించి మీడియా చర్చిస్తోంది. అభిషేక్ బచ్చన్ నుండి ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకున్నారనే పుకార్లు కూడా వచ్చాయి, అయితే అమితాబ్ బచ్చన్ ఒక్కపుడు చేసిన ప్రకటన వైరల్ అవుతుంది.
ఐశ్వర్య గురించి ఒక్కపుడు తప్పుడు వార్తను సోషల్ మీడియాలో రాసారు. దీనిపై ఆగ్రహించిన అమితాబ్ బచ్చన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2010లో, ముంబైలోని ఒక మీడియా ఐశ్వర్య రాయ్ గర్భవతి కాలేదని పేర్కొంది. అయితే ఈ వార్త అమితాబ్ బచ్చన్‌ను చాలా బాధపెట్టింది. అమితాబ్ వెంటనే ఆ తప్పుడు వార్తను విమర్శించారు. ఈ వార్త పూర్తిగా అబద్ధం అని.. అలాగే ఆధారం లేనిది అని అమితాబ్ అన్నారు.”ఐశ్వర్య తన కోడలు కాదని, తన కూతురేనని” అమితాబ్ అన్నారు. వారి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడుతానని ఆయన అన్నారు. తన కుటుంబంలోని మహిళలపై ఎలాంటి చెడు మాటలను సహించనని బిగ్ బి అన్నారు. అయితే ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.