చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ చివరి బంతికి బుమ్రా షాద్‌మన్ ఇస్లాంను(2) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఆకాశ్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. 20 పరుగులు చేసిన కెప్టెన్ శాంటో.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 5వ వికెట్ ముష్ఫికర్ రహీం.. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 22 ఓవర్లకు బంగ్లా స్కోర్: 76/5. షకీబ్ అల్ హసన్ (22), లిట్టన్ దాస్ (18) పరుగులతో క్రిజ్ ఉన్నారు.