Homeహైదరాబాద్latest NewsAkhanda 2 : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే.. ''అఖండ 2'' మూవీ టీజర్ వచ్చేస్తుంది..!!

Akhanda 2 : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే.. ”అఖండ 2” మూవీ టీజర్ వచ్చేస్తుంది..!!

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా ”అఖండ”. ఈ సినిమా 2021లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో దీనికి సీక్వెల్ ని ప్రకటించారు. ”అఖండ 2” (Akhanda 2) పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలనీ చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. ఈ సినిమా టీజర్ ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కుంభమేళాతో పాటు హిమాలయాలలో కొంత భాగాన్ని చిత్రీకరించారు. ఈ క్రమంలో ఫారిన్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మే నెలలో జార్జియాలో షూట్ చేయాలని దర్శకుడు బోయపాటి శ్రీను ప్లాన్ చేశారు.

Recent

- Advertisment -spot_img