Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా ”అఖండ”. ఈ సినిమా 2021లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో దీనికి సీక్వెల్ ని ప్రకటించారు. ”అఖండ 2” (Akhanda 2) పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను మధ్య గొడవ జరిగింది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమా విషయంలో బోయపాటి నిర్ణయాలు వల్ల బాలయ్య హర్ట్ అయ్యారు అని సమాచారం. ఈ సినిమాలో విల్లన్ గా ముందుగా బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ సంజయ్ దత్ రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పడంతో తమిళ్ హీరో అది పినిశెట్టి తీస్కున్నారు. ఆ విషయంలో బాలయ్య కొంచం హర్ట్ అయ్యారు. పాన్ ఇండియా సినిమా తీస్తూ బడ్జెట్ గురించి ఆలోచించడం ఏంటి అని బాలయ్య, బోయపాటి మధ్య కొంచం వాగ్వాదం జరిగింది. ఆ విషయంలో బాలయ్య కొంచం కాంప్రమైజ్ అయ్యారు. అయితే మరోసారి బాలయ్య సినిమా తీస్తున్న విధానంపై అసహనం వ్యక్తం చేసారు అని సమాచారం. బోయపాటి సరిగా సినిమాను తీయడం లేదు అని బాలయ్య నిరాశ చెందారు అని అంటున్నారు. ఈ క్రమంలోనే ”అఖండ- 2” సినిమా షూటింగ్ ఆపేసారు అని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఇద్దరు మధ్య గొడవలు ఏమి లేవు అని సినిమా షూటింగ్ సజావుగా జరుగుతుంది అని వెల్లడించారు. అయితే సినీ వర్గాలు మాత్రం బాలయ్య ఏదో నామమాత్రంగా సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు అని.. వారిద్దరి మధ్య సఖ్యత లేదు అని అంటున్నారు. 14 రీల్స్ ప్లస్ పై రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న దసరా కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది.