అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి సినిమా అతనికి నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత వచ్చిన ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఏజెంట్’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఈ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయాయి. అఖిల్ చివరిగా నటించిన సినిమా ఏజెంట్, బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర దాటింది, ఈ లోగా అఖిల్ కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేయలేదు. అతను చాలా స్క్రిప్ట్‌లు వింటున్నప్పటికీ, అతను ఇప్పటివరకు ఏ చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇవ్వలేదు.
ఎట్టకేలకు అఖిల్ రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు ఓకే తెలిపినట్లు ఇటీవలే కన్ఫర్మ్ అయింది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లలో ఒకదానికి ‘ధీర’ అనే పేరు పెట్టారు, దీనిని UV క్రియేషన్స్ నిర్మించనుంది.ఈ సినిమాతో అనిల్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. దీనితో పాటు అఖిల్ తన హోమ్ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక చిత్రంలో కూడా నటించనున్నాడు. గతంలో వినరో భాగ్యము విష్ణు కథకు దర్శకత్వం వహించిన మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.ఈ రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లు అఖిల్‌కి దక్కాల్సిన కమర్షియల్ విజయాన్ని అందిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు!