టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి ఓ ట్వీట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. నాగ చైతన్య ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన ట్వీట్… అందులో ‘నేను 2013లో 50 డాలర్లకు 100 బిట్ కాయిన్స్ కొన్నా.. ఇప్పుడు వాటి విలువ 6 మిలియన్ డాలర్లు. ఇప్పుడు గివ్ అవే ఇవ్వాలా వద్దా ఓట్ చేయండి’ అంటూ తన ఫ్యాన్స్ ను నాగ చైతన్య కోరినట్టుగా ఆయన అకౌంట్ నుంచి వచ్చిన ఆ ట్వీట్ లో ఉంది. అయితే ఇది నిజంగా నాగ చైతన్య చేసిందా అని చాలా మంది ఫాలోవర్స్ ఇప్పటికే ఓటు వేశారు. అయితే నిజానికి ఇలాంటి బిట్‌కాయిన్ వ్యవహారాల గురించి హ్యాకర్లు మాత్రమే పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నాగ చైతన్య అకౌంట్ హ్యాక్ అయిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. కాసేపటి క్రితమే ఆ ట్విట్ డిలీట్ డిలీట్ చేసారు.నాగ చైతన్య తన ట్విట్టర్ ఖాతాను 2017లో తెరిచాడు మరియు ప్రస్తుతం 2.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఈ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ పై నాగ చైతన్య ఎలా స్పందిస్తాడో చూడాలి.