ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సినీ స్టార్లు ముందుకు వస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళమిచ్చిన అక్కినేని కుటుంబం ఏపీ, తెలంగాణ వరద సహాయక కార్యక్రమాల కోసం రూ.కోటిని విరాళంగా అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ ప్రకటించాయి. ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నామని అక్కినేని కుటుంబం తెలిపింది. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్‌ని అందజేస్తున్నాయి.