Homeసినిమానెలంతా క‌ష్ట‌ప‌డ్డా రూ.5వేలు వ‌చ్చేవీ కావుః అక్ష‌య్‌

నెలంతా క‌ష్ట‌ప‌డ్డా రూ.5వేలు వ‌చ్చేవీ కావుః అక్ష‌య్‌

ముంబాయిః బాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న అక్షయ్‌ కుమార్ కెరీర్ ప్రారంభంలో అనేక ఉద్యోగాలు చేసేవాడు. ఇదే విషయాన్ని అక్షయ్‌ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆయన ఇటీవల వైల్డ్ లైఫ్ అడ్వెంచ‌ర్‌ బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ‘ఇన్‌ టు ది వైల్డ్‌’ షో చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఈ ఎపిసోడ్‌ డిస్కవరీ ప్లస్‌ యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. కర్ణాటకలోని బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఈ షూట్‌ జరిగింది. ఈ క్రమంలో అక్షయ్‌ తన జీవితంలోని పలు సందర్భాల్ని గుర్తు చేసుకున్నారు. ఆ వీడియోలో అక్ష‌య్ కెరీర్ ప్రారంభ స‌మ‌యంలో త‌న గురించి బేర్‌కు చెప్పారు.
థాయిలాండ్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న రోజుల్లో చాలా స్వేచ్ఛగా ఉండేవాడిన‌న్నారు. ఓసారి ఓ మహిళ నాకు టిప్పుగా ముద్దుపెట్టిందని ఓపెన్‌గా చెప్పాడు. నేను మార్షల్‌ ఆర్ట్స్‌ టీచర్‌గా ఉన్నప్పుడు అనుకోకుండా మోడలింగ్‌లోకి అడుగుపెట్టాన‌ని చెప్పిన అక్ష‌య్‌.. ‘నా దగ్గర శిక్షణ తీసుకుంటున్న ఓ అబ్బాయి తండ్రి మోడలింగ్‌ షూట్‌కి వెళ్లమని నాకు సలహా ఇచ్చారు. డబ్బులు వస్తాయని నేనూ వెళ్లా. రెండు గంటల షూట్‌కు రూ.21 వేల చెక్‌ ఇచ్చారు. నిజంగా అద్భుతంగా అనిపించింది. నేను నెలంతా కష్టపడి పిల్లలకి శిక్షణ ఇచ్చినా రూ.5వేలు మాత్రమే వస్తుంది. అలాంటిది రెండు గంటల వ్యవధిలో ఇంత సంపాదించడం ఆనందంగా అనిపించింది. ఆపై నటుడిగా మారా..’ అని అక్షయ్‌ చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img