HomeసినిమాAkshay Kumar : హిందూ రాజుల గొప్ప చ‌రిత్ర‌ను తొక్కేసారు

Akshay Kumar : హిందూ రాజుల గొప్ప చ‌రిత్ర‌ను తొక్కేసారు

Akshay Kumar : హిందూ రాజుల గొప్ప చ‌రిత్ర‌ను తొక్కేసారు

Akshay Kumar : అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన పథ్వీ రాజ్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

దేశ వ్యాప్తంగా హిందీ తో పాటు పలు ప్రాంతీయ భాషల్లో కూడా పృథ్వీ రాజ్ ను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన పృథ్వీ రాజ్ సినిమా కోసం అక్షయ్ కుమార్‌ దేశ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాడు.

ఈ సందర్బంగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దేశంలో స్కూల్‌ పిల్లలకు మొగలుల సామ్రాజ్యాలు.. వారి యొక్క రాజుల గురించి, వారి వారసత్వం గురించి పాఠాలు ఉన్నాయి కాని ఒక్క హిందూ రాజు గురించి.. రాజ్యం గురించి చరిత్రలో పాఠ్యాంశం లేకపోవడం సిగ్గు చేటు అన్నట్లుగా అక్షయ్‌ కుమార్‌ వ్యాఖ్యలు చేశాడు.

మొగలుల గురించి ఉన్నట్లుగానే హిందూ రాజుల గురించి కూడా ఈతరం పిల్లలకు నేర్పించాలంటూ ఆయన డిమాండ్‌ చేశాడు.

కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా హిందూ రాజులకు సంబంధించిన పాఠ్యాంశాలను జోడించాలంటూ అక్షయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశాడు.

భవిష్యత్తులో ఈ డిమాండ్‌ కాస్త ఉద్యమంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img