సెప్టెంబర్ 14న డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం
ట్విటర్లో టీజర్‌ను అభిమానులతో పంచుకున్న యాక్షన్ స్టార్
ముంబాయి: బాలీవుడ్లో యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్ అక్షయ్‌కుమార్ మరో సహసానికి పూనుకున్నారు. ప్రముఖ అడ్వెంచర్ టూరిస్టు బేర్ గ్రిల్స్‌తో కలిసి ఓ షో చేయనున్నారు. ఇటీవల అతడితో కలిసి చిత్రీకరించిన ఎపిసోడ్ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో టీజర్‌ను అక్షయ్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఈ అడ్వెంచర్ ఎపిసోడ్ సెప్టెంబర్ 11న డిస్కవరీ ప్లస్ యాప్‌లో విడుదల కానుంది. సెప్టెంబర్ 14న డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం అవుతుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, నటుడు రజనీ కాంత్‌లు బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసయాత్ర చేశారు. వారి తర్వాత ఈ యాత్ర చేసిన మూడో భారతీయుడిగా అక్షయ్ నిలిచాడు. ఈ వీడియోను అభిమానులతో పంచుకున్న అక్షయ్.. ‘బేర్‌గ్రిల్స్‌తో సాహసయాత్ర నాకు కొత్త అనుభవం. అతను ‘ఏనుగు టీ’తో నన్ను ఆశ్చర్యపరిచారు’ అంటూ చెప్పడం ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుతుంది.
బేర్‌గ్రిల్స్ తో అక్షయ్ అడ్వెంచర్
RELATED ARTICLES