తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటేషన్‌పై కేంద్రంలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన అకున్ సబర్వాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు తీసుకువస్తున్నట్లు సమాచారం. గతంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన కేసుల్లో అకున్ సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా అకున్ సబర్వాల్ ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్నప్పుడు టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.