Homeహైదరాబాద్latest Newsప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 'అలయ్ బలయ్' స్ఫూర్తి : సీఎం రేవంత్‌రెడ్డి

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ‘అలయ్ బలయ్’ స్ఫూర్తి : సీఎం రేవంత్‌రెడ్డి

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అలయ్‌బలై కార్యక్రమం జరిగింది. దత్తాత్రేయ కుటుంబం 19 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అయన మాట్లాడ్తూ.. ముఖ్యంగా అలయ్ బలాయ్ లేకపోతే తెలంగాణ ఉద్యమం కూడా అంతే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అలయ్ బలయ్ స్ఫూర్తి అని.. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరంగానే కార్యక్రమాలుండేవని.. కానీ బండారు దత్తాత్రేయ నాయకత్వంలో అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ఆర్‌ఎస్‌యు కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల వరకు అందరూ ఒక్కటై తెలంగాణ కోసం గళం విప్పారు. బండారు దత్తాత్రేయ నుంచి తన కుమార్తె బండారు విజయలక్ష్మి వారసత్వంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని ఆయన అభినందించారు.

Recent

- Advertisment -spot_img