తెలంగాణ అఖిల భారత వడ్డెర సంఘం అధ్యక్షుడుగా ఆలకుంట్ల హరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నూతన అధ్యక్ష్యుడు హరి మాట్లాడుతూ… వడ్డెరలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని వడ్డెర సంఘాలను ఐక్యమత్యం చేసి తమ సమస్యలపై పోరాడతామని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు వడ్డెర లకు సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సంఘం ఉపాధ్యక్షులుగా తురక వీరబాబు, దేవుళ్ళ వీరన్న, ఒర్సు బాల కృష్ణ, రాయల రమణయ్య, మహిళా ఉపాధ్యక్షులుగా గంజి రేణుక ఎన్నికైనట్లు హరి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తార్నాక కార్పొరేటర్ సరస్వతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటల పుల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు
వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి : ఆలకుంట్ల హరి
RELATED ARTICLES