– నర్సంపేట సెగ్మెంట్ లో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు
– ప్రతి గ్రామంలో 24 గంటలు అందుబాటులో మద్యం
– పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ
ఇదే నిజం, నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. డివిజన్లోని ఆరు మండలాల్లో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ప్రతి గ్రామంలో దాదాపు 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ 24 గంటల పాటూ మద్యం అందుబాటులో ఉంది. తాము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక బెల్ట్ షాపుల వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతోంది. బెల్ట్ షాపులు నిర్వాహకులు మూడు బీర్లు ఆరు క్వార్టర్లు గా వ్యాపారం కొనసాగిస్తున్నారు. డివిజన్ వ్యాప్తంగా 24 గంటలు బెల్ట్ షాపులు మందు బాబులకు అందుబాటులో ఉంటూ ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా నర్సంపేట పట్టణంలోని సుమారుగా చెప్పనటువంటి సంఖ్యలో ఉన్నాయని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మద్యానికి బానిసైన కుటుంబ పెద్దలు తమ రోజువారి సంపాదనంతా దానికి ఖర్చు చేస్తున్నారు. ఇక మద్యం మత్తులో గొడవలు, రోడ్డు ప్రమాదాలు సైతం నిత్యకృత్యమయ్యాయి.