ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం.. పురుషులు, మహిళలు వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ మద్యం తాగకూడదని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచించింది. 14 యూనిట్లు 10 మిల్లీలీటర్లు లేదా 8 గ్రాముల స్వచ్ఛమైన ఆల్కహాల్. ఉదాహరణకు, 568 మిల్లీలీటర్ల సాధారణ బీరు క్యాన్‌లో 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అంటే దాదాపు 3 యూనిట్ల మద్యం ఉంటుంది. బీర్‌లోని హెచ్‌డిఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ గుండెకు మంచిది. ఇది ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బీర్‌లో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు తక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి, అవి ఎముకలను బలోపేతం చేస్తాయి. ఫలితంగా బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉండదు.పరిమితుల్లో మద్యపానం మంచిది, కానీ పరిమితికి మించి తాగడం హానికరం. బీర్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయం, గుండె సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.