దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమలు కానున్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ కోడ్ స్థానంలో ఇవి రానున్నాయి. కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదులు, సమన్ల జారీ వంటివన్నీ ఆన్‌లైన్‌లో జరగనున్నాయి.
ఏమేం మారుతున్నాయి?
- క్రిమినల్ కేసులకు సంబంధించి మొదటి విచారణ జరిగిన 60 రోజుల్లోపు చార్జ్‌షీట్ దాఖలు చేయాలి.
- క్రిమినల్ కేసులలో విచారణ పూర్తయిన 45 రోజులలోగా తీర్పు వెలువడాలి.
- కొత్త చట్టాలలో రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలను శిక్హార్హమైన జాబితాలో చేర్చారు.