సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్లు రకరకాల పేర్లతో డబ్బు దోచుకుంటూనే ఉన్నారు. తాజా మరో కొత్త తరహా సైబర్ మోసానికి తెరలేపినట్లు తెలుస్తుంది. అయితే సైబర్ నేరగాళ్లు ఇండియా పోస్ట్ పేరుతో లింకులు పంపిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి పార్శిల్ వచ్చింది. అడ్రస్ కరెక్ట్‌గా లేదని వాళ్లే ఒక సందేశాన్ని పంపిస్తున్నారు. వాళ్లు పంపిన లింక్‌ను క్లిక్ చేసినప్పుడు ఓ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ చిరునామా అప్‌డేట్ చేస్తే మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ను మీ ఫోన్‌లోకి పంపించి మీ మొబైల్‌ను నేరగాళ్లు అధీనంలోకి తీసుకొనే అవకాశముందని తెలుస్తుంది. ఆ తర్వాత మీ డేటా తో మీ ఖాతాలోని డబ్బు దోచుకుంటున్నారు.