దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు శనివారం నుంచి సోమవారం వరకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 14 వరకు బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. రెండో శనివారం (12వ తేదీ), ఆదివారం (13వ తేదీ), అంబేద్కర్ జయంతి (14వ తేదీ) కారణంగా బ్యాంకు సేవలు బంద్ అవుతాయి. మంగళవారం (15వ తేదీ) నుంచి సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయి.