సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనుండగా, ఏప్రిల్ 15 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే మార్పులు, చేర్పుల కోసం ఫామ్-6ను సమర్పించాలని వివరించింది. ఓటర్ హెల్ప్ యాప్ లేదా https://voters.eci.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు.