ఏపీ ప్రజలకు వాతవరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా.. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ఏలూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో అక్కడకక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.