Homeహైదరాబాద్latest NewsCorona: అలర్ట్.. 7,383కు చేరిన కరోనా యాక్టివ్ కేసులు..!

Corona: అలర్ట్.. 7,383కు చేరిన కరోనా యాక్టివ్ కేసులు..!

Corona: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 17 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,383కి చేరుకుంది. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 2,007 యాక్టివ్ కేసులు నమోదవగా, గుజరాత్‌లో 1,441, వెస్ట్ బెంగాల్‌లో 747, మహారాష్ట్రలో 578, కర్ణాటకలో 573, తమిళనాడులో 243, ఉత్తరప్రదేశ్‌లో 238, ఆంధ్రప్రదేశ్‌లో 101, తెలంగాణలో 9 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

జనవరి నుంచి ఇప్పటివరకు కరోనా కారణంగా 97 మంది మృతి చెందగా, నిన్న ఒక్క రోజే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితి ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, టీకాలు వేయించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతోంది.

Recent

- Advertisment -spot_img