HYD: తెలంగాణకు డెంగీ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వార్నింగ్ ఇచ్చింది. వాతావరణం మార్పులతో డెంగీ వ్యాధి తెలంగాణలో విస్తరించే అవకాశముందని తెలిపింది. గతంలో కంటే కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశాలున్నాయని, అందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని WHO సూచించింది. ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని కోరింది.