ఆన్‌లైన్ మోసగాళ్లు కొత్తరకం మోసానికి తెరలేపారు. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)’ రివార్డ్స్ పేరిట ప్రజలకు వాట్సాప్, టెక్ట్స్ మెసేజులు పంపుతూ దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. ‘మీ ఎస్‌బీఐ రివార్డ్ రూ.7,250 యాక్టివేట్ అయింది’ అంటూ వచ్చే మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఓపన్ చేయవద్దని సూచించింది. రివార్డు పాయింట్ల విషయంలో తాము ఎలాంటి లింకులు పంపబోమని స్పష్టం చేసింది.