రాత్రి ఒంటి గంట వరకు మేలుకుని, తెల్లారి ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. నిద్రపోయే వేళలు, మానసిక ఆరోగ్యం, ప్రవర్తనలో నిలకడ లేకపోవడం వంటి వాటికి పరస్పర సంబంధం ఉందని వెల్లడైంది. రాత్రి ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించేవారు నిర్ణయాలు తీసుకోవడంలో, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారని వెల్లడైంది.