నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(NEFT) లావాదేవీలు ఈ రోజు చేయవద్దని వినియోగదారులకు HDFC బ్యాంకు సూచనలు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా జరిగే కొన్ని కార్యకలాపాల దృష్ట్యా ఈ రోజు చేపట్టే NEFT ట్రాన్సాక్షన్స్ ఆలస్యం కావడం లేదా అందుబాటులో ఉండకపోవడం జరగొచ్చని వెల్లడించింది. దానికి బదులు IMPS, RTGS, UPI విధానాలను ఉపయోగించుకోవాలని కోరింది.