Homeహైదరాబాద్latest NewsALERT: టోల్ గేట్​ రసీదు పడేస్తున్నారా? ఇక నుండి అలా చేయకండి.. దాంతో లాభాలివే..!

ALERT: టోల్ గేట్​ రసీదు పడేస్తున్నారా? ఇక నుండి అలా చేయకండి.. దాంతో లాభాలివే..!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: టోల్ రోడ్డులో ప్రయాణించే చాలా మంది టోల్ గేట్​ దగ్గర ఇచ్చే రసీదును పడేస్తుంటారు. నిజానికి ఈ రసీదును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రసీదు మీ దగ్గర ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. టోల్ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు మీ వాహనం అకస్మాత్తుగా ఆగిపోతే, మీ కారును తీసుకెళ్లడం టోల్ కంపెనీ బాధ్యత.
  2. ఎక్స్‌ప్రెస్ హైవేలో మీ కారులో పెట్రోల్ లేదా బ్యాటరీ అయిపోతే, మీ కారుకు పెట్రోల్, లేదా చార్జింగ్ అందించడం కూడా టోల్ సంస్థ బాధ్యత. ఈ ప్రయోజనం పొందాలంటే మీరు 1033కి కాల్ చేయాలి. పది నిమిషాల్లో టోల్ సిబ్బంది మీకు సహాయం చేస్తారు. మీరు 5 నుంచి 10 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందవచ్చు. కారు పంక్చర్ అయినా ఈ నంబర్​ కు కాల్ చేయొచ్చు.
  3. మీ కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కూడా మీరు ఈ నంబర్​ కు కాల్ చేయొచ్చు.
  4. కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైతే, వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే బాధ్యత కూడా టోల్ కంపెనీలదే. కాబట్టి టోల్ రసీద్​ జాగ్రత్తగా ఉంచుకోండి.

Recent

- Advertisment -spot_img